ఎమ్మెల్యే అధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు

ఎమ్మెల్యే అధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు

JGL: జగిత్యాల పావని కంటి ఆసుపత్రి, రోటరీ క్లబ్ సంయుక్తంగా జగిత్యాల నియోజకవర్గ నిరుపేదలైన 17 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేయించాయి. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనంతరం ఉచిత కంటి అద్దాలు, మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డా. విజయ్, నక్కల రవీందర్ రెడ్డి, మహేశ్వర్ రావు, రాజేశ్వర్ రెడ్డి, ప్రకాశ్, ఏనుగుల రాజు, మణి పాల్గొన్నారు.