యూరియా కొరతపై మంత్రికి విన్నవించిన ఎమ్మెల్యే

ATP: రాయదుర్గం పట్టణంలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు జిల్లా వ్యవసాయ శాఖ సంచాలకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. యూరియా సరఫరా డిమాండ్‌పై చర్చించారు. యూరియా కొరత ఎక్కువగా ఉందని అధికారులు వివరించగా.. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడుకు ఫోన్ చేసి నియోజకవర్గానికి యూరియా కొరత తగ్గించేలా చూడాలని విన్నవించారు.