VIDEO: తెలంగాణను పదేళ్ల వెనక్కి నెట్టారు: ఎంపీ
NGKL: గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంపన్న తెలంగాణ తిరోగమనంలోకి వెళ్లిందని ఎంపీ మల్లు రవి విమర్శించారు. గురువారం తెలకపల్లి మండలం రాంరెడ్డిపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ తీసుకున్న ఇష్టానుసార నిర్ణయాల వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.