ప్రజా సమస్యలను పరిష్కరించాలని వినతి

ప్రజా సమస్యలను పరిష్కరించాలని వినతి

హైదరాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన 'ప్రజావాణి'లో అదనపు కలెక్టర్ కదిరవన్ పలని ప్రజల నుంచి 556 దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో హౌసింగ్-453, పింఛన్లు-67, రెవెన్యూ -18 దరఖాస్తులు వచ్చాయి. సీఎం ప్రజావాణి, వాట్సాప్ దరఖాస్తులపై తక్షణమే స్పందించి, పెండింగ్‌లో లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.