సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలు
NLR: సోమశిల జలాశయంలో నీటిమట్టం వివరాలను అధికారులు వెల్లడించారు. గురువారం నాటికి ఎగువ ప్రాంతాల నుంచి 780 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు పేర్కొన్నారు. జలాశయంలో 63.403 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. కండలేరు కాలువకు 150, దక్షిణ కాలువకు 200, క్యూసెక్కులు చొప్పున వదులుతున్నట్లు వివరించారు.