'కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు సూపర్ సక్సెస్'

E.G: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'సూపర్ సిక్స్-సూపర్ హిట్' కార్యక్రమంలో పాల్గొనేందుకు నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ బుధవారం అనంతపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఉమ్మడి అనంతపురం జిల్లాల జనసేన పార్టీ నేతలు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు సూపర్ సక్సెస్ అయ్యాయని ఆయన పేర్కొన్నారు.