మా ఇంట్లో ఓట్లు.. అమ్మబడవు

మా ఇంట్లో ఓట్లు.. అమ్మబడవు

SRPT: నాగారం మండలం పస్తాల గ్రామంలో చిన్నారులు చేసిన పనికి యూత్ ఫిదా అవుతున్నారు. జిల్లా ప్రజా పరిషత్ పసునూరు స్కూల్‌లో ఆరవ తరగతి చదువుతున్న రెంటాల జోయల్ "ఓట్లు అమ్మడం, కొనడం నేరం" అని ఇంటిముందు రాసి పెట్టాడు. స్కూల్‌లో సోషల్ టీచర్ వెంకన్న ఇలా రాయమని చెప్పారని, చిన్నారులు అన్నారు. ఇది పది రోజుల క్రితమే ఏర్పాటు చేసినా, అది ఇప్పుడు గ్రామంలో వైరల్‌గా మారింది.