బట్టలతో బ్యాగ్స్ తయారు చేసిన విద్యార్థులు
ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్ అండ్ ఈకో క్లబ్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ ఆన్ క్లాత్ బ్యాగ్ మేకింగ్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు బట్టలతో సంచులను కుట్టారు. దానిపైన కళాశాల పేరును ముద్రించగా ఆకట్టుకుంది. ఇవే కాకుండా కాగితాలతో కూడా సంచులను రకరకాల డిజైన్లను తయారు చేశారు.