రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత
SKLM: నరసన్న పేట గ్రామీణంలో విద్యుత్తు సరఫరా నిలిపివేత ఉంటుంది. ఉర్లాం విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో మరమ్మతుల కారణంగా బుధవారం సరఫరా నిలిపేస్తున్నట్లు టెక్కలి డివిజన్ ఈఈ నరసింహకుమార్ తెలిపారు. ఉర్లాం, చోడవరం, లుకులాం, కోమర్తి గ్రామాల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అంతరాయం ఉంటుంది. వినియోగదారులు సహకరించాలని కోరారు.