అక్కయ్యపాలెంలో స్వామిత్వ సర్వే

అక్కయ్యపాలెంలో స్వామిత్వ సర్వే

బాపట్ల: వేటపాలెంలోని అక్కయ్యపాలెంలో శుక్రవారం పంచాయతీ సెక్రెటరీ రాణి ఆధ్వర్యంలో స్వామిత్వ సర్వే కార్యక్రమం నిర్వహించారు. ఇళ్ల ఖాళీ స్థలాలకు సర్వే చేశారు. ప్రభుత్వం ఇళ్లకు, ఖాళీ స్థలాలకు యాజమాన్య హక్కు పత్రాలను కల్పించేందుకే స్వామిత్వ సర్వే నిర్వహిస్తుందని రాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.