ఎస్పీకి వినతిపత్రం అందజేసిన ప్రేమజంట
కడపలో యువజంట సుమంత్, స్రవంతి మీడియా సమావేశం నిర్వహించారు. చాపాడు మండలానికి చెందిన వీరిద్దరూ మేజర్లు కావడంతో స్వచ్ఛందంగా రాయచోటి బైపాస్ రామాలయంలో సాదాసీదాగా వివాహం చేసుకున్నారు. అయితే కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, తమకు పోలీసు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు.