రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ASR: చింతపల్లి మండలం లంబసింగి ఘాట్‌లో బైక్ బోల్తా పడి ఇద్దరు గిరిజనులు గాయపడ్డారు. జీ.మాడుగులకు చెందిన వేమరాజు, కోడాపల్లికి చెందిన దావీదు శుక్రవారం డౌనూరు నుంచి బైక్‌పై చింతపల్లి వస్తున్నారు. లంబసింగి ఘాట్ బోడకొండమ్మ గుడికి సమీపంలోని మలుపు వద్ద బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరూ గాయపడ్డారు. వారిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.