ప్రతి మండలంలో వెయ్యి ఎకరాల్లో ఉద్యాన పంటలు

ప్రతి మండలంలో వెయ్యి ఎకరాల్లో ఉద్యాన పంటలు

VZM: మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కూరగాయల సాగును పెంచాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు. కలెక్టర్ ఛాంబర్లో శుక్రవారం ఉద్యాన శాఖపై సమీక్షించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి మండలంలో కనీసం 1000 ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి జరగాలన్నారు.