VIDEO: తిరుపతి మున్సిపల్ ఆఫీసులో ACB సోదాలు
TPT: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంపై వచ్చిన వివిధ ఫిర్యాదులపై విచారణ చేస్తున్నట్లు ఏసీబీ ASP విమల కుమారి తెలిపారు. బిల్డింగ్ అనుమతులు, టాక్స్‌లపై విచారణ జరుగుతుందని, రికార్డులు పరిశీలించి రిపోర్ట్ రాసి ఉన్నతాధికారులకు అందజేస్తామని ఆమె పేర్కొన్నారు.