పుత్తూరు వరసిద్ధి గణపతికి ఘనంగా ప్రత్యేక పూజలు

పుత్తూరు వరసిద్ధి గణపతికి ఘనంగా ప్రత్యేక పూజలు

TPT: పుత్తూరు పట్టణంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బుధవారం రాత్రి ఘనంగా వినాయక పూజ జరిగింది. ఇందులో భాగంగా ఆలయ ప్రధాన అర్చకుడు గురు రామచంద్ర శర్మ ఆధ్వర్యంలో పసుపు, కుంకుమ, పాలు, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి, గరికను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం పంచ హారతులు అందజేశారు.