యూరియా కోసం బారులు తీరిన రైతులు
చాపాడు మండలం చియ్యపాడు రైతు భరోసా కేంద్రం వద్ద యూరియా ఎరువుల కోసం ఇవాళ ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. గత కొన్నిరోజులుగా రైతులను పిడిస్తున్న యూరియా చియ్యపాడు రైతు సేవా కేంద్రానికి వచ్చింది. దీంతో వ్యవసాయ అధికారులు పంపిణీ చేపట్టారు. ఈ క్రమంలో ఎకరాకు ఒక బస్తా అయినా దొరికితే చాలు అనుకుని యూరియా కోసం రైతులు బారులు తీరి ఉన్నారు.