నా హోటల్ రూంలో ఆత్మ చూశాను: నటి
తన హోటల్ గదిలో ఒక ఆత్మను చూశానని నటి కృతి శెట్టి తెలిపింది. 'మా అమ్మతో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఒక ఆత్మ రూపాన్ని చూశా. మేము లైట్ వేయగానే పెద్ద శబ్దం వచ్చి అది మాయమైంది. ఆ ఆత్మ నాకు సాయం చేయడానికి వచ్చిందో లేక పాత్ర కోసం నేను చేస్తున్న సాధన వల్ల వచ్చిందో తెలియదు' అని చెప్పింది. కాగా, 'వా వాతియార్' మూవీలో కృతి.. ఆత్మలతో మాట్లాడే పాత్రలో కనిపించనుంది.