ఆ పథకంతో ఆటో కార్మికుల ఆదాయానికి గండి

VSP: మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సుల పథకం తమ ఆదాయాన్ని దెబ్బతీస్తోందని ఆరోపిస్తూ, ఆటో రిక్షా కార్మికులు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాసుబాబు, అధ్యక్షులు షేక్.రహిమాన్ పాల్గొన్నారు. మహిళలకు ఉచిత బస్సుల పథకాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని కోరారు.