భారత్ ధర్మసత్రం కాదు: అమిత్ షా
పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం గూఢచర్యం చేసే వ్యక్తులకు దేశంలో స్థానం లేదని తెలిసే కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా మండిపడ్డారు. రెడ్ కార్పెట్ వేసి మరీ అక్రమ చొరబాటుదారులకు ప్రవేశం కల్పిస్తోందని ధ్వజమెత్తారు. భారత్ ధర్మసత్రం కాదని.. అక్రమ చొరబాటుదారులకు దేశంలో స్థానం లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నేతలకు అసలు ప్రజల కష్టాలు తెలుసుకోవాలనే ఉద్దేశం ఉండదన్నారు.