VIDEO: చేవెళ్ల ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య
RR: చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్, టిప్పర్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరినట్లు పోలీసులు తెలిపారు. టిప్పర్ బస్‌పై ఒరగడంతో బస్‌లో ఉన్న ప్రయాణికులు కంకరలో ఇరుక్కు పోయారు. దీంతో స్థానికుల సహాయంతో అధికారులు క్షతగాత్రులను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.