ఉమ్మడి కర్నూలు జిల్లా మంత్రులకు శాఖల కేటాయింపు

KNL: ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయించారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, గృహ నిర్మాణ శాఖ, ఎన్ఎండీ ఫరూక్‌కు ముస్లిం మైనార్టీ సంక్షేమం, న్యాయశాఖ, టీజీ భరత్‌కు పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలు కేటాయించారు. బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ తొలిసారి మంత్రులు కాగా.. ఫరూక్ నాలుగో సారి మంత్రి కావడం గమనార్హం.