మా పౌరులను చంపితే.. మేమూ చంపుతాం: US

మా పౌరులను చంపితే.. మేమూ చంపుతాం: US

అమెరికన్లను చంపితే ఏం జరుగుతుందో ప్రపంచానికి చాటి చెప్పామని అమెరికా రక్షణ శాఖ మంత్రి హెగ్సెల్ తెలిపారు. తమ దేశ పౌరులను చంపిన వారిని తాము కూడా చంపి తీరుతామని హెచ్చరించారు. 47 ఏళ్లపాటు చేసిన తప్పులకు ఇరాన్ ఇప్పుడు మూల్యం చెల్లిస్తోందని పేర్కొన్నారు. ఇరాన్‌పై దాడి చేయాలంటే ధైర్యం ఉండాలని అన్నారని, ట్రంప్‌నకు ఆ ధైర్యం ఉంది అందుకే దాడి చేశారని వెల్లడించారు.