రూ. 9.34 కోసం పోరాటం.. బ్యాంక్‌కే చుక్కలు!
కర్ణాటకలో ఓ రైతు రూ. 50,000 బ్యాంక్ అప్పు తీర్చేశాడు. కానీ, కొన్నాళ్లకు కెనరా బ్యాంక్ నుంచి రూ. 9.34 బ్యాలెన్స్ ఉందని నోటీసు వచ్చింది. దీంతో ఆ రైతు రూ. 10 చెల్లించి, మిగిలిన 66 పైసల చిల్లర కోసం పట్టుబట్టాడు. 'బ్యాంకులు మా దగ్గర పైసా పైసా లెక్క చూస్తున్నప్పుడు, మా పైసలు మేము ఎందుకు వదులుకోవాలి?' అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.