ఇంటి పన్నుల వసూళ్లలో స్కామ్.?
BPT: చీరాల మున్సిపాలిటీలో ఇంటి పన్నుల వసూళ్లలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పన్నులు వసూలు చేసి, నకిలీ రసీదుల ఇస్తూ.. ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా బెస్తపాలెం సచివాలయ పరిధిలో రూ. లక్షల్లో వసూళ్లు జరిగినట్లు సమాచారం. బాధితులు వరుసగా బయటకు వస్తుండగా, 2024-25లో సుమారు రూ.5 లక్షల అక్రమాలు జరిగినట్లు అనుమానం.