వైసీపీకి షాక్..జనసేనలోకి భారీగా చేరికలు
E.G: రాజానగరం మండలం రాధేయపాలెం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో అభివృద్ధి కోసం నిత్యం శ్రమిస్తూ, ప్రజల మనిషిగా ఉన్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి ఈ చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.