కోడిపందాల స్థావరాలపై దాడి.. ఏడుగురు అరెస్ట్

కోడిపందాల స్థావరాలపై దాడి.. ఏడుగురు అరెస్ట్

NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని వవ్వేరు గ్రామంలో కోడిపందాలను ఆడుతున్నారని సమాచారంతో పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. కోడిపందాలు నిర్వహిస్తున్న ఎనిమిది మందిని, 20 బైకులు, రూ.8 వేల నగదు, రెండు కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొంతమంది పరారైనట్లు చెప్పారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.