'అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలి'

JGL: కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ.. కులం, మతం ఆధారంగా కాకుండా అభివృద్ధి చేసే నాయకులకు ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. మెట్పల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాన్ని అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోవాలని కోరారు.