రాష్ట్రం అప్పుల్లో ఉన్నా.. నిరుపేదల సంక్షేమానికి నిధులు
KMM: తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి నిధులు మంజూరు చేస్తుందని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. మంగళవారం వైరా క్యాంపు కార్యాలయంలో రూ.33 లక్షల విలువైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, రూ.33 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.