VIDEO: విశాఖలో మరో అగ్ని ప్రమాదం
విశాఖలో గురువారం ఉదరయం మరో అగ్ని ప్రమాదం చేటుచేసుకుంది. కొమ్మాదిలోని దేవి మెట్ట వద్ద స్వాప్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో కొంతమేర ఆస్తి నష్టం జరిగినట్లు దుకాణదారులు తెలిపారు.