ఘోర ప్రమాదం ముగ్గురికి గాయాలు

NDL: పట్టణ సమీపంలోని ఎస్వీఆర్ కళాశాల వద్ద ఆదివారం నాడు లారీ, పర్చూనర్ కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎస్వీఆర్ కళాశాల అధినేత వెంకట్రామిరెడ్డి మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.