వంశీ అరెస్టుపై మంత్రి లోకేశ్ స్పందన

వంశీ అరెస్టుపై మంత్రి లోకేశ్ స్పందన

కృష్ణా: వంశీ అరెస్టుపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. శనివారం ఆయన గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వంశీ జైలుకెళ్లారన్నారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయి అని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడిన మాపై అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు.