డిమాండ్లే పరిష్కారంగా అంగన్వాడీల నిరసన
ఒడిశాలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు రోడ్డెక్కారు. ఈ మేరకు ప్రభుత్వం ముందు 11 డిమాండ్లను ఉంచారు. తమను టీచర్లుగా గుర్తించాలి, గౌరవ వేతనం రూ.18వేలకు పెంచాలని, అలాగే అంగన్వాడీ సహయకులకు రూ.9 వేల జీతం ఇవ్వాలని కోరారు. వచ్చే శీతాకాల అసెంబ్లీ సమావేశాల లోపు తమ డిమాండ్లు నెరవేర్చాలని లేకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.