VIDEO: వైభవంగా కొండ గంగమ్మ ఊరేగింపు

VIDEO: వైభవంగా కొండ గంగమ్మ ఊరేగింపు

KDP: పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామ పొలిమేరలో వెలసిన కొండ గంగమ్మ తల్లి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం చుట్టుపక్క గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపు ముగించుకుని తిరిగి వెళ్లే ద్వారం దగ్గర అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.