పుంగనూరు స్వర్ణకవచాలంకృతగా మారెమ్మ దర్శనం
CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీవిరుపాక్షి మారెమ్మ ఆలయంలో దసరా వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ మంగళవారం కావడంతో భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. ఉదయమే అర్చకులు అమ్మవారిని వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం స్వర్ణకవచాలంకృత రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు.