'టీబీ రహిత దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యం'

HYD: దేశాన్ని టీబీ (క్షయరోగం) రహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆరోగ్య శాఖ మరొక కీలకమైన అడుగు వేసింది. ఈ క్రమంలో శివరాంపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో సీవై - టీబీ పేరుతో ఓ ఆధునిక పరీక్ష విధానాన్ని వైద్య సిబ్బంది ప్రారంభించారు. ఈ పరీక్ష ద్వారా శరీరంలో దాగి ఉన్న టీబీ బాక్టీరియా ఉందో లేదో ముందుగానే గుర్తించడం సాధ్యం అవుతుందని డాక్టర్లు తెలిపారు.