ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి పోటెత్తిన వరద

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి పోటెత్తిన వరద

E.G: 'మొంథా' తుఫాన్ ప్రభావంతో ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరింది. దీంతో జల వనరుల శాఖ అధికారులు 94,122 క్యూసెక్కుల మిగులు జలాలను బుధవారం సాయంత్రం సముద్రంలోకి విడుదల చేశారు. ముందస్తు చర్యలో భాగంగా తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు.