VIDEO: తాగునీటి కోసం ఎస్సీ కాలనీవాసులు తిప్పలు

SRD: సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామం ఎస్సీ వాడలో గత మూడు రోజుల నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా కావడం లేదు. దీంతో తాగునీటి కోసం స్థానికులు తిప్పలు పడుతున్నారు. దూరంలో ఉన్న వ్యవసాయం పొలంలో వెళ్లి తాగునీళ్లు తెచ్చుకుంటున్నామని స్థానికులు బుధవారం తెలిపారు. తరచూ నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోందని చెప్పారు. పలుమార్లు అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని వాపోయారు.