రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

W.G: పాలకొల్లు మండలం ఉల్లంపర్రు మెయిన్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో హోమ్ గార్డ్ రఘుమండ వెంకట రమణకు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ఆయన విధులకు హాజరయ్యేందుకు పోడూరు వెళ్తుండగా వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందన్నారు.