తోపుదుర్తి సోదరులు దుష్ప్రచారం ఆపాలి: సునీత

తోపుదుర్తి సోదరులు దుష్ప్రచారం ఆపాలి: సునీత

ATP: జిల్లాలోని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ఆయన సోదరులు దుష్ప్రచారాన్ని ఆపాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పాపంపేటలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు తొలగించారని స్పష్టం చేశారు. తాను తొలగింపజేస్తున్నానంటూ తోపుదుర్తి సోదరులు అసత్యప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.