కొల్లేరుకు పోటెత్తుతున్న వరద

ఏలూరు: ఆల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొల్లేరు నిండుకుండలా ఉంది. విజయవాడ, ఏలూరు ప్రాంతాల నుంచి కొల్లేరుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. మండవల్లి మండలంలోని చింతపాడు, కొవ్వాడలంక, మణుగునూరు, నుచ్చుమిల్లి, తక్కెళ్లపాడు, కైకలూరు మండలంలో నత్తగుల్లపాడు, శృంగవరప్పాడు గ్రామాల సమీపానికి వరదనీరు చేరుకుంది.