'తుఫాన్‌పై ప్రభుత్వం అనుసరించిన తీరు అమోఘం'
VZM: మొంథా తుఫాన్ ఎదుర్కొనడంలో ప్రభుత్వం అనుసరించిన ముందుచూపు అభినందనీయమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జిల్లాలో తుఫాన్ కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకపోవడానికి కారణం ప్రభుత్వం చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలేనని పేర్కొన్నారు. కలెక్టర్ రామ సుందర్ రెడ్డి అన్ని శాఖలను ఆదేశిస్తూ కంట్రోల్ రూంలో ఉండి పర్యవేక్షించారన్నారు.