'ఆ గ్రామం పేరు చెప్తే గుర్తొచ్చేది బీరకాయలే'

KKD: పిఠాపురం మండలం చిత్రాడ గ్రామం పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది అక్కడి బీర విత్తనాలు. తీయగా ఉండే ఈ బీరకాయలతో కూర చేసుకుంటే రుచి అదిరిపోతుందని ప్రతీతి. ప్రస్తుతం విత్తనాల కోసమే ఇక్కడ 50ఎకరాల్లో చిత్రాడ బీరను సాగు చేస్తున్నారు. కాయలు బాగా ఎండిన తర్వాత విత్తనాలు తీసి, కిలో రూ.1,500చొప్పున అమ్ముతామని ఈ వ్యాపారంలో ఉన్న నాగసత్యవతి పేర్కొన్నారు.