VIDEO: స్వామి జాతర మహోత్సవాలకు రాట ప్రతిష్ట

VIDEO: స్వామి జాతర మహోత్సవాలకు రాట ప్రతిష్ట

E.G: అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో కనుమ ప్రారంభమయ్యే భక్తాంజనేయ స్వామి వారి జాతర మహోత్సవాలకు సోమవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాట ప్రతిష్ట చేశారు. ఆలయంలో ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, జాతర మహోత్సవాలకు సంబంధించి పందిరి రాటను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.