ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
KKD: కాకినాడ శివారు పేర్రాజుపేటలో తోట శ్రీను (41) అనే వ్యక్తి వ్యక్తిగత కారణాలతో మానసిక సమస్యలతో బాధపడుతూ ఆదివారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పెయింటింగ్ పనులు చేసే శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజమహేంద్రవరం వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. కాకినాడ రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.