మార్కెట్లో నేటి మిర్చి ధరలు ఇలా

WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే తేజ మిర్చి, 341 రకం మిర్చి ధరలు తగ్గాయి. నిన్న క్వింటా తేజ మిర్చి ధర రూ. 13వేలు పలకగా.. నేడు రూ.12,500కి తగ్గింది. అలాగే 341 రకం మిర్చికి సోమవారం రూ. 11,500 ధర రాగా.. ఇవాళ రూ.11 వేలకు పడిపోయింది. మరోవైపు వండర్ హాట్ (WH) మిర్చి క్వింటాకు ఈరోజు రూ.13,800కి చేరిందని మార్కెట్ అధికారులు తెలిపారు.