ఇన్సూరెన్స్ కోసం బొమ్మతో అంత్యక్రియలు
పనిమనిషి పేరుపై ఉన్న రూ.50 లక్షల ఇన్సూరెన్స్ కొట్టేయడానికి ఢిల్లీ వ్యాపారులు మాస్టర్ స్కెచ్ వేశారు. ఓ ప్లాస్టిక్ బొమ్మను శవంలా మార్చి.. యూపీలోని గంగానది ఒడ్డున అంత్యక్రియలకు రెడీ అయ్యారు. దహనం చేసి, ఆ రశీదుతో డబ్బులు క్లెయిమ్ చేద్దామనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. స్థానికులకు డౌట్ వచ్చి చూడగా అది బొమ్మ అని తేలింది. దీంతో పోలీసులు ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు.