లింగారెడ్డిపల్లి హైస్కూల్‌లో 'పోషణ పక్వాడా'
ప్రకాశం: కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి హైస్కూల్‌లో శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో “8వ పోషణ పక్వాడా–2026” కార్యక్రమం ఐసీడీఎస్ సూపర్వైజర్ పార్వతి నిర్వహించారు. గర్భధారణ నుంచి 3 సంవత్సరాల వరకు పిల్లల మెదడు అభివృద్ధికి తల్లి పోషకాహారం, తల్లి పాలు, పరస్పర చర్యలు కీలకమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.