YSR చిత్రపటానికి నివాళులర్పించిన ప్రభుత్వ విప్

BHNG: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా నేడు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రభుత్వ విప్, ఆలేరు MLA బీర్ల ఐలయ్య అధికార స్వగృహంలో రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలు సాధించాలని అన్నారు. CMగా రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివని కొనియాడారు.