ఈ నెల 22న జాబ్ మేళా

GNTR: నైపుణ్యాభివృద్ది సంస్థతో కలిసి ఈనెల 22న గుంటూరులో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. శ్రీనివాసరావుపేట క్యాంప్ కార్యాలయంలో బుధవారం జాబ్ మేళా పోస్టర్‌ని ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. బ్రాడీపేట 3వ లైన్‌లోని మాస్టర్ మైండ్స్‌లో జాబ్ మేళా జరుగుతుందన్నారు. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు చదివినవారు అర్హులన్నారు.