నేడు గుత్తిలో ఎమ్మెల్యే గుమ్మనూరు పర్యటన
ATP: గుత్తిలో ఇవాళ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రతినిధులు మీడియాకు తెలిపారు. ఉదయం 11 గంటలకు గుత్తి కోటలోని హైస్కూల్లో విద్యార్థులకు కిట్లను పంపిణీ చేస్తారన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బ్యాంక్ మేనేజర్లతో సమావేశం, 1.00గంటకు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.